తాజా వార్తలు • Latest News Sunday, 15 Nov 2026
9POLITICS
తెలుగు | English
సమాచారం • విశ్లేషణ • ప్రజాస్వరం
BREAKING
సినిమా

Varanasi Movie: వారణాసి మూవీ.. వాయిదా పడే ఛాన్స్..!

By Administrator · 2026-11-13 15:51:00 · 4 views

Varanasi Movie: వారణాసి మూవీ.. వాయిదా పడే ఛాన్స్..!

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన ఓ టాక్ వైరల్‌గా మారింది. వారణాసి వాయిదా పడనుందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముందుగా ప్రకటించిన తేదీకి రాకపోవచ్చని లేటేస్ట్ టాక్. వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

మహేశ్ బాబు బర్త్‌ డే ఆగస్టు 9న కావడంతో అదే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా లభించనుంది. బర్త్ డేతో పాటు వారణాసి మూవీని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ అభిమానులకు దక్కనుంది. కాగా..ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. రామాయణ ఎపిసోడ్‌లో కాసేపు శ్రీరాముడిగానూ కనువిందు చేయనున్నారు. ప్రియాంక చోప్రా మందాకిని పాత్ర పోషిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా కనిపించనున్నారు.

Tags: